Thursday, 26 January 2012

Hello Saru Bhale Varu Lyrics in Telugu - Amayakuralu Old Telugu Movie Song Lyrics

చిత్రం:అమాయకురాలు (1971)
సంగీతం:ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత:ఆరుద్ర
నేపధ్య గానం:ఘంటసాల, సుశీల



పల్లవి:
హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు
పైకెంతో చల్లని వారు తమరెంతో అల్లరివారు
నా మనసు దోచినారు

చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు
లల్లలల్ల ఒహో ఒహో లలల్లల

చరణం 1:
రానిమ్ము రానిమ్ము ఏమైనకానీ.. నా ఇంపు నా సొంపు నీ సొమ్ము కాదా ||2||
నా తోడు నీవై.. నీ నీడ నేనై.. కలవాలి కరగాలి కావాలి ఒకటిగా.. ఆ..ఓ..
చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు

చరణం 2:
రావాలి రావాలి సరియైన అదను.. ఆనాడు ఇవ్వాలి నీ నిండు మనసు.. ||2||
ఆలోగ నీవు ఆవేశ పడకు.. ఆకాశ సౌధాలు నిర్మించ రాదులే.. ఏ .. ఓ..

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు
చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు

చరణం 3:
అనురాగ బంధాలు సడలించవద్దు.. పెనవేయు హృదయాలు విడదీయవద్దు ||2||
నీ లేత వలపు ఆమోదమైన.. బంగారు స్వప్నాలు పండేది ముందెపుడో.. ఓ.. ఓ..

హలో సారూ భలే వారు చెలి వలపు తెలుసుకోరు
చాలు చాలు సరసాలు ఇక దూరంగా ఉంటేనే మేలు

No comments:

Post a Comment