చిత్రం:బావమరదళ్ళు (1960)
సంగీతం:పెండ్యాల
గీతరచయిత:ఆరుద్ర
నేపధ్య గానం:ఘంటసాల, సుశీల
పల్లవి:
హృదయమా... ఓ బేల హృదయమా..
ఒకేసారిగ నీకింత సంతోషమా... హృదయమా.. ఆ.. ఆ..
చరణం 1:
తీయని ఊహాలు హాయిగ నీలో మరల చిగిర్చె సుమా ...
మరల చిగిర్చె సుమా ..
పూచిన పూవులు నోచిన నోములు
కాచి ఫలించు సుమా.. అవి కాచి ఫలించు సుమా
హృదయమా... ఓ బేల హృదయమా...
మనసు తెలుపుగా నీకింత మొమోటమా
హృదయమా...
చరణం 2:
తీగెలు సడలిన సితార తాను తిరిగి మ్రోగె సుమా... తిరిగి మ్రోగె సుమా ..
మ్రోగిన పాటే మోహానమై అనురాగము నించె సుమా... అనురాగము నించె సుమా ...
హృదయమా... ఓ బేల హృదయమా..
ఒకేసారిగ నీకింత సంతోషమా..
హృదయమా...
చరణం 3:
అందారాని ఆ చందమామ నీ చెతికి అందె సుమా.. చెతికి అందె సుమా..
చందమామ నీ చేతులలోనే బందీ అగును సుమా... ఇక బంది అగును సుమా...
హృదయమా... ఓ బేల హృదయమా...
మనసు తెలుపుగా నీకింత మొమోటమా
హృదయమా... ఆ.. ఆ
"I really enjoyed reading your post! It's wonderful to see such insightful content about Telugu music. You’ve captured the essence of Song Lyrics Telugu so beautifully—there’s so much emotion in every line. Keep up the great work!"
ReplyDelete